ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య.. ఎందుకంటే..

కామారెడ్డిటౌన్​, వెలుగు : అనారోగ్యంతో ప్రైవేట్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటున్న ఓ పేషెంట్‌‌‌‌ బాత్‌‌‌‌రూంలో ఉరి వేసుకొని సూసైడ్‌‌‌‌ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా లింగంపేటమండల కేంద్రానికి చెందిన లింగాల సాయిలు (45) కుడి చేతికి 15 రోజుల కింద గాయమైంది. 

సాయిలుకు షుగర్‌‌‌‌ వ్యాధి ఉండడంతో మణికట్టు వరకు ఇన్‌‌‌‌ఫెక్షన్‌‌‌‌ అయింది. దీంతో 23న కామారెడ్డిలోని జీవదాన్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌ అయి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకున్న అనంతరం 25న డిశ్చార్జి అయ్యాడు. నొప్పి మళ్లీ మొదలు కావడంతో 29న మరోసారి హాస్పిటల్‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌ అయ్యాడు. 

అయితే నొప్పి తగ్గదన్న భయానికి తోడు, ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌కు ఎంత ఖర్చు అవుతుందన్న భయంతో ఆదివారం అర్ధరాత్రి హాస్పిటల్‌‌‌‌లోని బాత్‌‌‌‌రూంలోకి వెళ్లి టవల్‌‌‌‌తో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన అతడి భార్య స్వరూప పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.