ఈ మధ్యనే యూట్యూబ్‌లో స్లీప్ టైం పేరుతో ఒక ఫీచర్ వచ్చింది. అది సోషల్ మీడియాలో ఎక్కువ టైం ఉంటూ నిద్ర సరిగా పోవడం లేదని ఈ ఫీచర్ తెచ్చారు. అలాగే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో ‘స్కూల్ టైం’ అనే కొత్త ఫీచర్ వచ్చింది.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వాడని పిల్లల్ని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అయితే, చాలామంది పిల్లలు ఫోన్లకు అలవాటు పడడంతో సోషల్ మీడియా ఎఫెక్ట్ వాళ్ల మీద పడుతోంది. చక్కగా ఆడుకుంటూ కేరింతలు కొట్టాల్సిన పిల్లలు.. గంటల కొద్దీ గేమ్స్, రీల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. దీంతో పేరెంట్స్‌కి ఏం చేయాలో తోచక డైలమాలో పడుతున్నారు. ఇలా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల్ని తిరిగి దారిలో పెట్టేందుకు గూగుల్ ఫిట్‌బిట్ ఏస్ ఎల్టీఈ స్మార్ట్‌వాచ్‌లో ‘స్కూల్ టైమ్’ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా స్మార్ట్ ఫోన్స్‌లో పిల్లలు చదువుతున్నప్పుడు రీల్స్, వేరే ఎంటర్టైన్మెంట్ విషయాలు చూడకుండా కంట్రోల్ చేస్తుంది. దాంతో వాళ్లు చదువు మీదనే దృష్టి పెడతారని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. పేరెంటల్ కంట్రోల్ యాప్ ద్వారా స్కూల్ టైంలో ఏ యాప్‌లను పిల్లలు వాడుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చు. ఆ టైంలో పిల్లలు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే కాల్ చేయడం లేదా ఎస్ఎంఎస్ చేసే విధంగా సెలక్ట్ చేసుకోవాలి. స్కూల్ టైం తర్వాత కూడా ఈ ఫీచర్‌ని యాక్టివ్‌గా ఉంచొచ్చు. ఈ ఫీచర్ వల్ల పిల్లలకి రీల్స్, సోషల్ మీడియా, గేమ్స్ పట్ల ఉన్న ఆసక్తి తగ్గుతుంది.