మెంగారంలో వైద్యశిబిరం ఏర్పాటు

లింగంపేట, వెలుగు: మండలంలోని మెంగారంలో శుక్రవారం వైద్యశిబిరం  ఏర్పాటు చేశారు.   గ్రామస్తుడు అన్నం రాజు డెంగ్యూ వ్యాధితో మృతి చెందడంతో మృతుడి ఇంటికి పీహెచ్​సీ వైద్యురాలు హిమబిందు వెళ్లి ప్రైవేట్​ఆసుపత్రిలో చికిత్స పొందిన రిపోర్ట్​లను పరిశీలించారు. అనంతరం గ్రామానికి చెందిన 45 మందికి శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

వీరిలో జ్వర నిర్ధారణ జరిగిన ఐదుగురికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్​ హిమబిందు మాట్లాడుతూ డెంగ్యూవ్యాధితో మృతిచెందిన అన్నం రాజు మెడికల్​ రిపోర్ట్​లను  జిల్లా వైద్యాధికారికి  పంపిస్తామన్నారు. గ్రామస్తులు సీజనల్​ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని, అలాగే ఇండ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో సీహెచ్​ఓ రమేశ్, సూపర్​వైజర్లు ఫరీదా, యాదగిరి, చంద్రకళ, ఏఎన్​ఎం రాజమణి, ఆశ కార్యకర్త రాజేశ్వరి పాల్గొన్నారు.