నిజామాబాద్‪లో ఎస్‌బీఐ ఏటీఎం ధ్వంసం రూ.25 లక్షలు చోరీ

 హైదరాబాద్: నిజామాబాద్‌ జిల్లాలో భారీ చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంను ధ్వంసం రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న అర్ధరాత్రి  రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి  ఓ వెహకిల్​లో నలుగురు దుండగులు మాస్కులు ధరించి వచ్చారు. అక్కడ తమ ఫుటేజ్‌ రికార్డు కాకుండాఉండడానికి సీసీ కెమెరాలపై స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసి అందులో ఉన్న రూ.25 లక్షల క్యాష్​ను ఎత్తుకెళ్లారు. ఏటీఎం విడిభాగాలను బయట పడేశారు. సమాచారం తెలుసుకున్న రుద్రూర్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.