గ్యాప్ సర్టిఫికెట్ అడిగితే..తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చులకనగా మాట్లాడుతున్నరు

గన్నేరువరం, వెలుగు : మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించేందుకు గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడిగితే తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చులకనగా మాట్లాడుతున్నాడని ఓ వ్యక్తి బుధవారం గన్నేరువరం తహసీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట నిరసనకు దిగాడు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన మామిడి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2008లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆర్థిక సమస్యలతో చదువు మానేసి ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఏజెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోసం చేయడంతో మధ్యలోనే తిరిగొచ్చాడు. 

ప్రస్తుతం ఎంబీఏ చదివేందుకు గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరంగా కాగా తహసీల్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్నిసార్లు అప్లై చేసినా నిరాకరిస్తున్నారని వాపోయాడు. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి తన గోడు చెప్పుకుంటే.. ‘ఈ వయస్సులో నీకు చదువు ఎందుకు, ఇప్పుడు కాలేజీకి వెళ్లి కూర్చుంటావా’ అని చులకనగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు గ్యాప్ సర్టిఫికెట్ ఇప్పించాలని, అవహేళన చేసిన తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.