పెండ్లి బరాత్ లో డ్యాన్స్ చేస్తూ .. యువకుడు మృతి

  • జగిత్యాల జిల్లా కమ్మరిపేటలో విషాదం

జగిత్యాల టౌన్, వెలుగు: పెండ్లి బరాత్ లో  డ్యాన్స్ చేస్తూ ఓ యువకుడు కుప్పకూలి పడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  భీమారం మండలం కమ్మరిపేటకు చెందిన యువకుడు వన్నెల సంజయ్(23) బుధవారం మోత్కరావుపేటలోని తన మేనమామ కొడుకు పెండ్లికి వెళ్లాడు. అదేరోజు రాత్రి బరాత్ లో డ్యాన్స్ చేస్తుండగా సంజయ్ గుండె నొప్పితో కుప్ప కూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. యువకుడి మృతితో కమ్మరిపేటలో తీవ్ర విషాదం నెలకొంది.