నా భార్య నన్ను కొట్టి ఇంటి నుంచి గెంటేసింది..అర్థనగ్నంగా పీఎస్కు బాధితుడు

భర్త కొడుతున్నాడని..వేధిస్తున్నాడని భార్య  పోలీస్ స్టేషన్లకు వెళ్లిన ఘటనలు మనం చూశాం. కానీ ఈ మధ్య భార్య వేధింపులు తట్టుకోలేక  పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న  భాదితుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి.  లేటెస్ట్ గా ఓ  వ్యక్తి  తన భార్య రోజు వేధిస్తోందని..కొడుతోందని అర్థనగ్నంగా  పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ  ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. 

కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య కొడుతోందని అర్థనగ్నంగా  బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.  తనను కొట్టి ఇంటి నుంచి గెంటేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ దగ్గర ఉన్న వారు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యాన్ని గురయ్యారు. దీంతో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.