భీకర రోడ్డు ప్రమాదం.. లారీలు నుజ్జు నుజ్జు

కరీంనగర్, జగిత్యాల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. కొండగట్టు రెండు లారీలు ఢీకొన్నాయి. లారీల ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. అందులో ఇద్దరు డ్రైవర్లు ఇరుక్కుపోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అతి కష్టమీద వారిని బయటకు తీశారు. రాజస్థాన్‌కి చెందిన మార్బుల్ లారీ కరీంనగర్ నుంచి జగిత్యాల వస్తుంది. జగిత్యాల నుంచి పత్తిలోడుతో కరీంనగర్ వెళ్తున్న మరో లారీ రోడ్డు ప్రమాదంలో ఢీకొన్నాయి. డ్రైవర్లు దేవిలాల్, వీరయ్యలు తీవ్రంగా గాయపడ్డారు.. పరిస్తితి విషమంగా ఉంది. వారిని 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.