బ్రిక్స్ సమావేశాల వేళ భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం

న్యూఢిల్లీ: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశాల వేళ భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల మధ్య గత కొన్ని నెలలుగా నెలకొన్న  లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) సమస్యల పరిష్కారానికి భారత్, చైనా ముందుకొచ్చాయి. ఈ మేరకు భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి  పెట్రోలింగ్ పునఃప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం (అక్టోబర్ 21) ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘‘భారతదేశం, చైనా బార్డర్‎లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరింది. 2020లో ఈ ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిణామాలకు ఈ ఒప్పందం ఒక పరిష్కారం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఒప్పం డెప్సాంగ్, డెదం ప్రకారంమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ తిరిగి ప్రారంభం కానుండగా.. త్వరలోనే మరికొన్ని ఏరియాల్లో కూడా అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇరుదేశ అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 

తూర్పు లడఖ్‌లో నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు రెండు దేశాల సైనికాధికారులు గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సమస్యలను పరిష్కరించి బార్డర్‎లో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా బార్డర్ లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. తాజా ఒప్పందంతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ పునఃప్రారంభించనున్నారు. 

ALSO READ | భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే: డేవిడ్ కెమరూన్

కాగా, ఈ నెల (అక్టోబర్ ) 22, 23 తేదీల్లో రష్యాలోని  కజాన్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ సోమవారం (అక్టోబర్ 21) రష్యాకు వెళ్లనున్నారు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాడీ ని మోభేటీ అవుతారని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో భారత్, చైనా ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు అంగీకరించడం ప్రధాని మోడీ, జిన్ పింగ్ భేటీ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.