8 వేల చెక్కును 28 లక్షలుగా మార్చిండ్రు.. జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో భారీ స్కాం

జగిత్యాల:  జగిత్యాల జిల్లా ఆస్పత్రిలో భారీ స్కాం వెలుగు చూసింది. ఓ అవినీతి అధికారి కోటి రూపాయలకు పైగా నిధులునుస్వాహా చేశారు. ఉద్యోగుల ఖాతాలో వేయాల్సిన డీఏ, ఏరియర్స్  చెక్కులను ఫోర్జరీ చేసి ఓ ఉద్యోగి  తన వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ ఘటనలో ఆ ఉద్యోగితో పాటు అధికారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఎనిమిది వేల చెక్కును 28 లక్షలుగా మార్చి నిధులు డ్రా చేశారు. బదిలీపై వెళ్లిన ఉద్యోగుల ఖాతాలో క్యాష్​​జమ కాకపోవటంతో  ఫోర్జరీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  మోసంపై వైద్యవిధాన పరిషత్ కు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే సదరు ఉద్యోగి నుంచి ఇప్పటికే రూ. 50 లక్షలు రికవరీ చేసినట్టు సమాచారం. నిధుల డ్రాపై ఉన్నతాధికారుల విచారణ కొనసాగుతున్న ట్లు తెలిసింది.