షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం..ఏడేళ్ల బాలుడు సజీవ దహనం

కరీంనగర్  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.మనకొండూర్ మండలం ఈదలగట్టేపల్లిలో షార్ట్ సర్క్యూట్ తో ఓఇంటికి నిప్పంటుకొని 7ఏండ్ల బాలుడు సజీవ దహనమైయ్యాడు. బాలుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో బాలుడు మంటల్లో కాలిపోయాడు. బాలుడి మృతితో ఈదలగట్టేపల్లి గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి.