మన్మోహన్‌‌‌‌‌‌‌‌కు సైకత నివాళి

మాజీ ప్రధాని మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ మృతిపై పలువురు వివిధ రకాలుగా నివాళులర్పిస్తున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని భాగ్యనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన సైకత శిల్పి రేవల్లి శంకర్‌‌‌‌‌‌‌‌ ఇసుకతో మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చిత్రాన్ని రూపొందించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. అలాగే సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌ టీచర్‌‌‌‌‌‌‌‌ కాపిల్ల నరేశ్‌‌‌‌‌‌‌‌ సుద్దముక్కపై మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రూపాన్ని చెక్కారు. అనంతరం నివాళి అర్పించి, మన్మోహన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు.