ఇల్లు చమక్ చమక్ మెరిసిపోవాలా..? అయితే లైటింగ్ సిస్టమ్ ఇలా సెట్ చేసుకోండి

ఇల్లు, ఇంటి అలంకరణ.. మరింతగా ఆకర్షించాలంటే లైటింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్‎గా ఉండాలి. ప్రదేశాన్ని బట్టి బల్బులు ఏర్పాటు చేసుకుంటే గదులన్నీ ఏ సమయంలోనైనా వెలిగిపోతుంటాయి. ఇందుకోసం వివిధ డిజైన్లున్న ల్యాంప్‎లు, షేడ్స్ ఎంచుకోవాలి. లివింగ్ రూమ్ మొదలు బెడ్రూమ్, స్టడీ రూమ్, బాత్రూమ్‎లో మంచి వెలుతురునిచ్చే లైట్లు అమర్చుకుంటే ఇల్లు వెలిగిపోతుంది

బెడ్ రూమ్

1. బెడ్రూమ్ మధ్యలో లైటింగ్ ఏర్పాటనేది పాత ఫ్యాషన్. పైగా ఈ ఏర్పాటు వల్ల కళ్ల మీద నేరుగా వెలుగు పడి నిద్రపట్టడు. దీని బదులుగా బ్యాంప్ షేడ్స్, అప్ లైట్స్   పిన్ లైట్స్ఉపయోగించాలి. లేతగా, తర్కువ తీవ్రతతో ఉండే ఈ రకమైన లైటు నిద్రకు అనుకూలం

2. వాల్ రైట్ లేదా మెయిన్ సెంట్రల్ లైట్లకు డిమ్మర్ స్విచ్ ఏర్పాటు చేసుకోవాలి ఇన్ స్టెంట్ గా వెలుగు తగ్గించటానికి ఈ ఏర్పాటు సౌకర్యంగా ఉంటుంది.

3. లైట్ స్విచ్ తలుపుకి, బెడ్ రెండిటికీ దగ్గవ గా ఉండాలి స్విచ్ కోసం మంచందిగాల్సిన అవసరం ఉండకూడదు.

4. వార్డ్ రోబ్ లో టంగ్ స్టెన్ లేదా ఫ్లోరెసెంట్  సిట్రస్స్ బల్యులు ఏర్పాటు చేసుకోవాలి వార్ట్రోబ్ తెరవగానే ఈ లైట్లు వాటంతట అవే వెలిగే ఏర్పాటు చేసుకుంటే ఈజీ అవుతుంది.

 5. డ్రెస్సింగ్ టేబులకు రెండు పక్కల హారిఆం టల్ లైట్లు ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే అద్దంలో కనిపించే ప్రతిబింబంలో నీడలు ఎక్కువగా కనిపిస్తాయి. 

6. బల్బ్ లు బిగించుకునే షేడ్స్ లోపలి వైపు తెల్లగా బయటి వైపు లేత రంగులో ఉండాలి. ఇలాంటి షేడ్స్ వల్ల బెడ్రూమ్లో ఆహ్లాదకర మైన వార్మ్ లైట్ పరుచుకుంటుంది.

లివింగ్ రూమ్

 1 లివింగ్ రూమ్‎లో పెట్టిన పుస్తకాలు షెల్ఫ్‎లు, మొక్కలు, ఫొటోలు, పెయింటింగ్స్ హైలైట్ అయ్యేలా లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి..

 2 షెల్ఫ్‎లు , టేబుళ్ల దగ్గర డిజైన్లు ఉండే టేబుల్ ల్యాంప్స్ అమ రా ఇలాంటి లైటు రూమ్‎ను ఎక్కువ విశాలంగా కనిపించేలా  చేస్తారు 

ALSO READ | ఒంట్లో మొండి కొవ్వు కరిగించాలంటే..ఒళ్లు వంచాల్సిందే!

3.గది మధ్యలో అమర్చే ఓవర్ హెడ్ లైట్ ఎక్కువ ఓల్టేజీదైతే.. రూమ్లో నీడలు వస్తాయి. కాబట్టి మరీ ఎక్కువ వెలుగుతో కాకుండా తక్కువ ఓల్టేజ్ వెలిగే   ఓవర్ హెడ్ లైట్ సెలెక్ట్ చేసుకోవాలి.

4. సోఫాల వెనక స్టాండప్ లైటర్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల సిలింగ్ పైకి వెలుతురు రిప్లెక్ట్ అయి సోఫాలో కూర్చునే వాళ్ల మీద డైరక్ట్‌గా  పడకుండా ఉంటుంది

5. టీవీ చూస్తున్నా థియేటర్‌‌లో ఉన్న ఎఫెక్ట్ రావాలంటే.  టీవీ వెనుక లేదా పక్కన లైట్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.

కిచెన్

1. వంటగది మొత్తం వెలుతురు ఉండేలా. లైటింగ్ ఉన్నా సరే ప్రత్యేకంగా వంట చేసే చోట లైటింగ్ ఎక్కువగా అవసరమువుతుంది. కాబట్టి. ఓ క్లైవ్ లైట్ ఏర్పాటు చేసుకోవచ్చు.

2. స్టాకి సరిగ్గా పైన లైట్ ఫిక్స్ చేసుకుంటే వంట చేసేటపుడు ఆ జిడ్డు అంతా లైట్‌కు అంటుకుంటుంది. కాబట్టి స్టాకి మరీ పైన కాకుండా కొంచెం పక్కగా లైట్స్ ఫిక్స్ చేసుకోవాలి 

3. కిచెన్ సింక్ దగ్గర కిటికీ ఉంటే అక్కడ కూడా ఒక లైట్ పెట్టుకోవచ్చు.

4.  వాల్ యూనిట్స్ చివర మినీ ఫ్లోరెసెంట్ లైట్లు బిగించుకోవచ్చు. ఈ  లైట్ల వల్ల వెలుతురు సమానంగా పరుచుకుని వంటగదిలో పని తేలికవుతుంది.

v6 వెలుగు, లైఫ్..