నవీపేట్​ మండలంలో నాలుగు కాళ్ల కోడి పిల్ల

నవీపేట్​ మండలం యంచ గ్రామంలో నాలుగు కాళ్లతో కోడి పిల్ల జన్మించింది. గ్రామానికి చెందిన వంజరి సాయిబాబా కోళ్లను పెంచుతున్నాడు. మూడు రోజుల క్రితం కోడిపెట్ట గుడ్లను పొదగగా ఒక కోడిపిల్లకు  నాలుగు కాళ్లు ఉండటంతో సాయిబాబా కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. విషయం తెలియడంతో గ్రామస్తులు కోడిపిల్లను చూసేందుకు తరలివస్తున్నారు.