పోలీస్ స్టేషన్ ముందు నగ్న ప్రదర్శన

హైదరాబాద్:  మద్యం మత్తులో  పీఎస్​ ముందు ఓ మందుబాబు  హల్ చల్ సృష్టించాడు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనీరు గ్రామానికి చెందిన జైపాల్ అనే వ్యక్తి  రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం పోలీస్ స్టేషన్ ముందు  నిన్న అర్ధరాత్రి దిగాడు. అయితే అప్పటికే ఫుల్​గా మద్యం తాగి ఉన్నాడు.  స్టేషన్ లో  నైట్ డ్యూటీ చేస్తున్న పోలీసుల వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్ స్టేషన్ గేటు ముందు బట్టలిప్పి రోడ్డుపై  నగ్నంగా, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. అడ్డుకున్న పోలీసులపైకి ఎగరబోయాడు. జైపాల్ ను సముదాయించేందుకు పోలీసులు సుమారు రెండున్నర గంటల పాటు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో జైపాల్ దగ్గర నుంచి ఫోన్ ను లాక్కొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మత్తు దిగిన తరువాత  జైపాల్ కు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.