డిస్నీ థీమ్​ ఇల్లు కావాలా..

డిస్నీ కార్టూన్స్​కి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. అందుకు ఈ ఇల్లే సాక్ష్యం. మామూలుగా కార్టూన్లంటే ఒక ఊహాప్రపంచం. అందులో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తాయి. దానిలో ఎంతో అందమైన దృశ్యాలు కూడా ఉంటాయి. అందుకే ఆ కార్టూన్​లను మళ్లీ మళ్లీ చూసినా బోర్ కొట్టదు. దాంతో ఎక్కువగా అభిమానించే వాళ్లు ఎక్కువసార్లు చూడడమే కాదు.. డిస్నీ థీమ్​తో ఉన్న వస్తువుల్ని కూడా ఇష్టపడుతుంటారు. 

అయితే, ఇక్కడ అభిమానం ఎల్లలు దాటింది. వేల్స్​కు చెందిన ఒక డిస్నీ ఫ్యాన్​.. తన ఇంటిని మొత్తం డిస్నీ థీమ్​తో నింపేశాడు. అందులో కార్టూన్లు, పాత్రలు, పాటల లిరిక్స్, లొకేషన్స్.. ఇలా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మొత్తం ఊహాప్రపంచాన్ని కళ్లముందుకు తెచ్చేశాడు. ఆ ఇంట్లో ఏ వైపు చూసినా డిస్నీ థీమ్​ కనిపిస్తుంది. అయితే, దాన్ని రెంట్​కి ఇచ్చే ఆయన తనకు డిస్నీ మీద ప్రేమతోనే ఇలా డిజైన్ చేయించాడట. 

తనలాగే డిస్నీ ఫ్యాన్ అయిన వాళ్లు దీన్ని రెంట్​కి తీసుకుంటారు అనుకున్నారు. అనుకున్నట్టే ఒక వీరాభిమాని ఆ ఇంటిని రెంట్​కి తీసుకుంది. దాదాపు ఆమె లైఫ్​ అంతా అక్కడే గడిపింది. అయితే ప్రస్తుతం ఆ ఇల్లు ఖాళీగా ఉంది. అందుకని ఆ ఇంటిని ఫొటోలు తీసి ఇంటర్నెట్​లో అప్​లోడ్ చేశాడు. డిస్నీ హోమ్ కావాలంటే సంప్రదించమని చెప్పాడు.  దీంతో ఆ ఇంటి ఫొటోలు చూసిన పబ్లిక్ అవాక్కవుతున్నారు.