న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కుటుంబంలోకి మరో కొత్త ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోడీ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ప్రధాని మోడీ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ రావడం ఏంటి అనుకుంటున్నారా..? అసలు విషయం ఏంటంటే.. ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసమైన 7 లోక్ కళ్యాణ్ మార్గ్ నివాసంలో మోడీ పెంచుకుంటున్న ఓ ఆవు గర్భం దాల్చింది. ముదురు గోధుమ రంగులో నుదిటిపై కాంతి గుర్తుతో ఉన్న పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నుదిటిపై కాంతి గుర్తుతో చూడ ముచ్చటగా ఉన్న ఆవు దూడకు దీప్జ్యోతి అని నామకరణం చేసినట్లు మోడీ వెల్లడించారు.
ఇక, ఆవు దూడతో ప్రధాని మోడీ తన నివాసంలో ఎంతో సరదాగా గడిపారు. పూజ గదిలో ఆవు దూడను పక్కనే పెట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆవుదూడను అప్యాయంగా ఎత్తుకుని.. నుదిటిపై మోడీ ముద్దాడారు. ఈ ఫొటోలను మోడీ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘‘గావ్ సర్వసుఖ ప్రదాః.. 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలోకి శుభప్రదంగా కొత్త సభ్యుడు వచ్చారు. తన నివాసంలో ఆవు కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదిటిపై కాంతి గుర్తు ఉంది. అందుకే, ఆవుదూడకు 'దీప్జ్యోతి' అని పేరు పెట్టాను’’ అని మోడీ ట్వీట్ చేశారు.