పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్య

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బీబీపేట్ మండలం కోనాపూర్లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెంది చెట్టుకు ఉరేసుకొని ఒకరు, ఇంట్లో దూలానికి ఉరేసుకొని మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీబిపేట్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, దోమకొండ మండలం అంబారీపేట గ్రామానికి చెందిన వీణలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరని మనస్తాపం చెందిన జంట ఆత్మహత్యే తమకు శరణ్యం అని డిసైడ్ అయ్యారు.సాయికుమార్ గ్రామ శివారులోని పంట చేను వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. వీణ ఇంట్లో దూలానికి ఉరేసుకోని ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ జంట మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.