రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

  • సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్​లో శివారులో ఘటన

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ లో రైటర్ గా పని చేస్తున్న కానిస్టేబుల్  పెంబర్తి నవీన్(38) మంగళవారం రాత్రి చిన్నకోడూర్  పోలీస్ స్టేషన్  పరిధిలోని ఇబ్రహీం నగర్  గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మంగళవారం డ్యూటీ ముగించుకొని తిరిగి సిద్దిపేటకు వస్తుండగా, మార్గమద్యలో ఆయన నడుపుతున్న కారు  అదుపుతప్పి డివైడర్  మధ్యలో నుంచి పక్కకు వెళ్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న సీపీ బి. అనురాధ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. యువ కానిస్టేబుల్ ను కోల్పోవడం బాధాకరమని, డిపార్ట్​మెంట్  తరపున రావాల్సిన అన్ని బెనిఫిట్స్  త్వరలోనే ఆయన ఫ్యామిలీకి అందజేస్తామని తెలిపారు. అడిషనల్  డీసీపీ ఎస్. మల్లారెడ్డి, సిద్దిపేట రూరల్  సీఐ శ్రీను

హుస్నాబాద్  సీఐ శ్రీనివాస్, టూ టౌన్  సీఐ ఉపేందర్, ఎస్ఐలు అభిలాష్, బాలకృష్ణ, విజయ్ భాస్కర్  తదితరులు నవీన్  స్వగ్రామం రాజక్కపేట మండలం దుబ్బాక గ్రామానికి వెళ్లి డెడ్​బాడీపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. చిన్నకోడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.