ములుగు జిల్లాలో కుంగిన బ్రిడ్జి.. రాకపోకలు నిలిపేశారు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద వంతెన కుంగిపోయింది. రాళ్ల వాగుపై వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వంతెన పైనుంచి భారీ వాహనాలు వెళ్లొద్దని పోలీసుల సూచించారు. రాళ్లవాగు వంతెన పైనుంచి రాకపోకలు నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెంకటాపురం-చర్ల, భద్రాచలం వైపు వెళ్ళు వాహనదారులు అలర్ట్ గా ఉండాలని స్థానికుల విజ్ఞప్తి చేస్తున్నారు. 

అడుగు మేరకు వంతెన కుంగడంతో స్థానికులు భయ భ్రాంతులకు గురవుతున్నారు.  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.  బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.  భద్రాచలం వెళ్లే వాహనాలను ఏటూరు నాగారం మీదుగా మళ్లించారు. ఇష్టారాజ్యంగా.. ఇసుక లారీలు ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లడంతో డ్యామేజ్ అయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.