తల్లికి బాసటగా బిడ్డ

తల్లి పడుతున్న కష్టాన్ని చూసీ తాను కూడా ఉడుత భక్తిగా సాయం చేయాలనుకుంది ఓ చిన్నారి. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఓ తల్లి అడవి నుంచి కట్టెలు మోసుకుంటూ తెస్తుండగా..  చిన్నారి చిన్నగా కట్టెల మోపు మోస్తూ సాయమందించింది.  ఆదివారం కావడంతో తల్లికి తోడుగా సాయం చేస్తున్న  ఫొటోను ‘వెలుగు’ క్లిక్ మనిపించింది.  ‌‌ ‌‌ - వెలుగు, ఫొటోగ్రాఫర్