నల్గొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో ఆకట్టుకున్న పోలీస్ పరేడ్

వెలుగు ఫోటోగ్రాఫర్, నల్గొండ : నల్గొండ జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 265 మంది ఏఆర్ కానిస్టేబుల్స్ 9 నెలలు శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన పాసింగ్​  ఔట్ పరేడ్ కు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ముఖ్యఅతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రాణవాయువులా పోలీసులు పనిచేయాలని సూచించారు.

పోలీస్ శాఖలో అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ తెలంగాణ పోలీస్ డిపార్ట్​మెంట్ కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తెలిపారు. అనంతరం మెరిట్ సాధించిన వారికి ట్రోఫీ అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ కానిస్టేబుల్స్ వాళ్ల కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.