పొతంగల్ సొసైటీ డైరెక్టర్ల రాజీనామా

పొతంగల్ (కోటగిరి), వెలుగు: పొతంగల్ సొసైటీకి చెందిన 9 మంది డైరెక్టర్లు సోమవారం రాజీనామా చేశారు. సొసైటీ ఉపాధ్యక్షుడు సహా ఎనిమిది మంది డైరెక్టర్లు తమ రాజీనామా లెటర్లను సొసైటీ సెక్రటరీ భరత్‌‌కు అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని జాకోరా సొసైటీ అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టి సొసైటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది.

వారం గడవక ముందే పొతంగల్ సొసైటీ పాలకవర్గ సభ్యులు సైతం మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పొతంగల్ సొసైటీలో రైతులకు సంబంధించిన దాదాపు రూ.నాలుగు కోట్లు దుర్వినియోగం అయ్యాయని, చైర్మన్, సీఈఓలను సస్పెండ్​ చేయాలంటూ ఇటీవల జరిగిన మహాజన సభలో తీర్మానించారు. ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో  డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : మేడారం జాతరలో 11 చోట్ల ఫ్రీ వైఫై సేవలు