నల్గొండ జిల్లాలో 844 మంది విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు మూకుమ్మడి సెలవు

  • రెండు రోజుల కింద ఎంపీడీవో, ఇద్దరు సెక్రటరీలను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • నిరసనగా డ్యూటీకి హాజరుకాని కార్యదర్శులు

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు బుధవారం మూకుమ్మడిగా సెలవు పెట్టారు. మొత్తం 844 మంది విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు విధులకు హాజరుకాకపోవడం హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. నల్గొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సి. నారాయణరెడ్డి మంగళవారం మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గడ్డి కోత యంత్రాలు కొనకపోవడం, మొక్కల పెంపకం, శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కంపోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహణ సరిగా లేకపోవడం వంటి కారణాలతో గుర్రంపోడు ఎంపీడీవో పి.మంజులను, విధులకు గైర్హాజరైన పులిచర్ల విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ నాగరాజు, వాచ్యాతండా సెక్రటరీ స్వప్నను కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. దీన్ని నిరసిస్తూ జిల్లాలోని 844 మంది విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు బుధవారం మూకుమ్మడిగా సెలవు పెట్టారు. 

సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన వారిని తిరిగి డ్యూటీలోకి తీసుకోవాలని, అప్పటివరకు తాము డ్యూటీకి వచ్చేది లేదని పట్టుబట్టారు. గడ్డి కోసే యంత్రాలు, ఫాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెషీన్లు కొనడానికి కూడా పంచాయతీల్లో డబ్బులు లేకపోవడంతో అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.