మితిమీరిన వేగం తీస్తోంది ప్రాణం

  • రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో ఏడు నెలల్లో 80 మంది మృతి
  • మృతుల్లో టూవీలర్లపై ప్రయాణించేవారే అధికం 
  • చాలా చోట్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు లేకపోవడం.. ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉల్లంఘనలతోనే ప్రమాదాలకు కారణం 
  • రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై నిర్వహణను మరిచిన కాంట్రాక్ట్​సంస్థ 

ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కంగన్​హాల్​ షాపు నిర్వహించే ఆకుల సత్యనారాయణ సామానును కొనుగోలు చేసేందుకు హైదరాబాద్​ వెళ్లేందుకు సోమవారం రాత్రి స్కూటీపై గోదావరిఖని బస్టాండ్​కు బయలుదేరారు. రాజీవ్​ రహదారిపై గోదావరిఖని వైపు వెళుతుండగా ఎన్టీపీసీ సోలార్​ పవర్​ ప్లాంట్​ వద్ద వెనక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో సత్యనారాయణ స్కూటీపై నుంచి ఎగిరి డివైడర్​పై పడి చనిపోయాడు.’ ఇలాంటి ఘటనలు రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో నిత్యకృత్యమయ్యాయి. 

గోదావరిఖని, వెలుగు : రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో వాహనాల ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజలు, వాహనదారుల ప్రాణాలు తీస్తున్నాయి. గత 7 నెలల్లో 80 మందిమృతి చెందారు.  మృతుల్లో చాలా మంది బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్కూటీల మీద ప్రయాణించేవారే అధికంగా ఉంటున్నారు. కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారి నిడివి ఎక్కువగా ఉంది. ఈ రోడ్డుపై వాహనాలు  వేగంగా వెళ్తుండడంతో ప్రమాదాలు  ఎక్కువగా  జరుగుతున్నాయి.  మితిమీరిన వేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలు, చాలా చోట్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్లు లేకపోవడమే ప్రమాదాలకు  కారణంగా తెలుస్తోంది. 

అవగాహన కల్పించినా మార్పు లేదు

రోడ్డు భద్రత, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన కల్పించినా  వాహనదారుల్లో మార్పు రావడం లేదు. రామగుండం కమిషనరేట్​ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 72 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 80 మంది మృత్యువాత పడ్డారు.   అలాగే 34 ప్రమాదాల్లో 36 మందికి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మరో 93 ఘటనల్లో 184 మంది స్వల్పంగా గాయపడ్డారు.  ప్రమాదాల్లో 32 వాహనాలు పూర్తిగా డ్యామేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. అతి వేగం ప్రాణాలకు ముప్పు అంటూ పోలీసులు ఎంత ప్రచారం చేసినా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. 

రాజీవ్​ రహదారిపైనే ఎక్కువ ఘటనలు...

 గోదావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గోదావరి బ్రిడ్జి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్ద నుంచి సుల్తానాబాద్​ దుబ్బపల్లి వరకు పెద్దపల్లి జిల్లా పరిధిలో రాజీవ్​రహదారి విస్తరించి ఉంది. ఈ హైవేపై వివిధ పరిశ్రమలకు చెందిన వాహనాలతోపాటు హైదరాబాద్, నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చంద్రాపూర్​ వైపు భారీ వాహనాలు తిరుగుతంటాయి.  కాట్నపల్లి, సుల్తానాబాద్​, పెద్దపల్లి, ఎన్టీపీసీ, గోదావరిఖని వంటి ప్రాంతాల్లో ఊర్ల మధ్యలో నుంచే భారీ వాహనాలు పోతున్నాయి.

 టోల్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సూలు చేస్తున్న హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఆర్ సంస్థ రోడ్డు నిర్వహణను స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిగా చేపట్టకపోవడం ప్రమాదాలకు కారణం అవుతోంది.  రోడ్డు ప్రమాదాలలో సగానికి ఎక్కువ రాజీవ్​ రహదారిపైనే జరుగుతుండడం గమనార్హం. గోదావరిఖని నుంచి సుల్తానాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకున్న రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రహదారిపై పట్టణాలు, జనావాసాలున్న ప్రాంతాల్లో స్పీడ్​ లిమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 

ప్రమాదాలకు కారణమైతే శిక్ష తప్పదు

హిట్​అండ్​రన్​కేసుల్లో ఇతరుల మరణాలకు కారణమైతే వాహన డ్రైవర్లకు పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాలు వచ్చాయి. అలాగే మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వాహన ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదా తల్లిదండ్రులకు ఏడేండ్ల వరకు శిక్ష పడుతుంది. డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసుల్లోనూ కఠిన చట్టాలు ఉన్నాయి. 

రాజేంద్రప్రసాద్​, ట్రాఫిక్​ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్, రామగుండం