పని ఒత్తిడి పెరుగుతుందా?..తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు

ఇటీవల రోజుల్లో ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులైన..బిజినెస్ చేసే వ్యక్తులైనా పని ఒత్తిడికి గురవుతున్నామని తరుచుగా డాక్టర్ల దగ్గరకు వెళ్లడమనేది బాగా పెరిగి పోయింది. ఏదో ఒక మెడిసిన ఇచ్చి మా స్ట్రెస్ ను తొలగించండి అని రిక్వెస్ట్ చేస్తుంటారు. అయితే స్వతహాగా స్ట్రెస్ ను జయించలేమా..? ఒత్తిడి తగ్గించు కోవాలంటే ఏంచేయాలి..వంటి సందేహాలు కలుగుతుంటాయి. పనిఒత్తిడి తగ్గించుకునేందుకు మనం కొన్ని చిట్కాలు లేదా వ్యాహాత్మకంగా నడుచుకుంటే ఒత్తిడి జయించొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. 

పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు, పని సామర్థ్యం పెంచుకోవడానికి తప్పని సరిగా కొన్ని మార్గాలను ఎంచుకోవాలి. మనం చేసే పని ఒత్తిడితో కూడుకున్నది అయినప్పటికీ దాన్ని అధిగమించేందుకు కొన్న ప్రణాళికలు చాలా అవసరం. 

రోజంతా పనిచేస్తున్నప్పడు చిన్న చిన్న రిలాక్సేషన్ చాలా అవసరం. ఇది మన మనస్సుకు విశ్రాంతి నిస్తుంది.  కనీసం అర్థగంటకు ఒకసారి కూర్చున్న చోటి నుంచి కదలాలి. నడవాలి. ఇలా చేస్తే  ఒత్తిడిని దూరం చేయొచ్చు.

ALSO READ | Lifestyle News: ఒత్తిడి అంటే ఏమిటి.. అసలు ఎందుకు వస్తుందో తెలుసా

రోజువారీ పనులను లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ముందు ముఖ్యమైన వాటిని నిర్ధారించుకొని ముందుగా చేయాలి. పని సులభం కావడానికి , ఏదైనా సందేహాలున్నా సహా యం కోసం ఇతరులను అడగడానికి సంకోచించకూడదు. 

పని మధ్యలో మీ ముక్కు ద్వారా డీప్ బ్రీత్ ( లోతైన శ్వాస) పీల్చడానికి ప్రయత్నించాలి. ఒక క్షణంపాటు అలాగే శ్వాస బిగపట్టి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా వద లాలి. 

మీరు పనిచేసే ప్రాంతాన్ని చక్కగా క్రమబద్ధంగా ఉంచుకోవాలి. ఇది ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తుంది. ఉదాహరణకు టేబుల్ పై వస్తువులు చిందరవందరగా ఉండటం. ఇలాంటివి మీ దృష్టిని పనిమీదనుంచి మరల్చి ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఎల్లప్పుడు మీరు పనిచేసే ప్రాంతాన్ని నీట్ గా, వస్తువులన్నీ ఆర్డర్లో ఉండేలా చేసుకోవాలి. 

అవసరమైనప్పుడు నో అని చెప్పడం నేర్చుకోవాలి. వర్క్ సమయంలో కొన్ని బౌండరీస్ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.ఇది ఆరోగ్యకరమైన పని అందించడమే కాకుండా జీవన సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. 

మీ స్ర్టెస్ గురించి సహోద్యోగులు, నిర్వాహకులతో  పంచుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటం ఉండకూడదు. మీ భావాలు పంచుకోవడం వల్ల సమస్య పరిష్కారినికి సహాయపడుతుంది. 

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా వాకింగ్ వంటి శారీరక శ్రమ అవసరం. తప్పకుండా రోజులో కొంత సమయంలో నడక లేదా యోగాకు కేటాయించండి.. 
ఇలా కొన్ని చిట్కాలు, ప్రణాళికల ద్వారా పని ఒత్తిడిని జయించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.