నిజామాబాద్ జిల్లాలో ఘనంగా పంద్రాగస్టు

  •   జిల్లాల్లో జెండావిష్కరించిన కార్పొరేషన్​ చైర్మన్లు  పటేల్​ రమేశ్​రెడ్డి, అనిల్​ 
  •     ఉమ్మడి జిల్లాలో ఘనంగా జెండా పండుగా..

కామారెడ్డి​​​ / నిజామాబాద్​​, వెలుగు : ఉమ్మడి జిల్లాలో గురువారం స్వాతంత్ర  దిన  వేడుకలు ఘనంగా జరిగాయి.   కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకలకు చీఫ్​ గెస్టుగా  టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పటేల్​​ రమేశ్​రెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్​ వేడుకలకు చీఫ్​ గెస్ట్​గా  రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి  అనిల్ హాజరై జండాను ఆవిష్కరించారు.  వేడుకల్లో భాగంగా  ఫారెస్ట్​, హెల్త్​, ఆర్టీసీ, ఫైర్​  డిపార్ట్​మెంట్ల అధికారులు  తమ శకటాలను ప్రదర్శించారు.

 ప్రభుత్వ స్కూల్స్​, కేజీవీబీ,  బీసీ హాస్టల్​ స్టూడెంట్స్   సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.   ఆయా శాఖల  ఆఫీసర్లతో పాటు సిబ్బందికి  ప్రశంసా  పత్రాలు అందించారు.  జిల్లాకేంద్రంతో పాటు కలెక్టరేట్లలో, స్కూళ్లు, కాలేజీలు, ఊరు వాడల్లో  వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   కలెక్టర్​ ఆశిశ్​ ​సంగ్వాన్​,  ఎస్పీ సింధూశర్మ, జిల్లా ఫారెస్టు ఆఫీసర్​  నిఖిత, మున్సిపల్ చైర్​పర్సన్​ ఇందుప్రియ , నిజామాబాద్​లో  జిల్లా జడ్జి సునీత కుంచాల

ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, డాక్టర్​ భూపతిరెడ్డి,   మేయర్​ దండు నీతూ కిరణ్​, స్టేట్​ సహకార ఫెడరేషన్​ చైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, డీసీసీబీ చైర్మన్​ కుంట రమేశ్​​రెడ్డి, ఐడీసీఎంఎస్​ చైర్మన్​ తారాచంద్, కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్​,  కార్పొరేషన్​ కమిషనర్​ మంద మకరంద్​ పాల్గొన్నారు. 

ప్రజలకు మెరుగైన పాలన

  •     టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్  రమేశ్​రెడ్డి

కామారెడ్డి : ప్రజలకు మెరుగైన పాలన తమ ప్రభుత్వం అందిస్తుందని టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ పటేల్​ రమేశ్​రెడ్డి పేర్కొన్నారు.  స్వాతంత్ర  దిన  వేడుకల్లో ఆయన మాట్లాడుతూ..  జిల్లాలో  ప్రజా పాలనలో భాగంగా ఆరు గ్యారంటీల అమలు కోసం 33 సేవా కేంద్రాలు  ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలు 49,500 మంది రైతులకు రూ. 231 కోట్లు,  రూ.లక్షన్నర లోపు రుణాలను 24,816 మందికి  రూ.211 కోట్లు మాఫీ చేశామన్నారు. 2024–-25 ఏడాదికి 1,93,768 మంది రైతులకు రైతుబీమా కల్పించామన్నారు. కాళేశ్వరం 22 ప్యాకేజీ కింద  ఇప్పటి వరకు రూ. 452 కోట్లు పనులు జరిగాయన్నారు.  

నాగమడుగు ఎత్తిపోతల స్కీమ్​ లో  రూ. 51 కోట్ల పనులు కంప్లీట్​ అయ్యాయన్నారు.  రాజీవ్​ ఆరోగ్య శ్రీలో ఈ ఏడాది ఇప్పటి వరకు  7,911 మందికి రూ.13 కోట్ల ట్రీట్​మెంట్​ ఇచ్చామన్నారు.  1,09,436 మంది రైతులకు ఫ్రీ కరంటు ఇస్తున్నామన్నారు.   గృహాజ్యోతి కింద 200 లోపు యూనిట్ల కరంటును  1 లక్షా  56,67‌‌‌‌‌‌‌‌ఇండ్లకు ఇస్తున్నామన్నారు.  

రైతన్నలకు ఆర్థిక స్వాతంత్ర్యం​

  •     మినరల్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ చైర్మన్​ అనిల్​ 

నిజామాబాద్​ :  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు తెలంగాణ రైతన్నలకు రుణమాఫీ ద్వారా ఆర్థిక స్వతంత్ర్యం వచ్చిందని మినరల్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్​ చైర్మన్​ ఈరవత్రి అనిల్​ అన్నారు. స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.    జిల్లాలో  మొత్తం 70,084 మంది రైతులు రుణమాఫీ కింద రూ.452.12 కోట్ల లబ్దిపొందారని తెలిపారు.  నిజాం చక్కెర ఫ్యాక్టరీ రీఓపెన్​ చేయడానికి సర్కారు  కృషి చేస్తోందని, అందులో భాగంగా బ్యాంకర్ల అప్పులు తీర్చడానికి వన్​టైం సెటిల్​మెంట్​ కింద రూ.40 కోట్ల  రిలీజ్​ చేశామన్నారు.  

గల్ఫ్​ బాధితుల కోసం బోర్డు ఏర్పాటు చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్​రెడ్డి ఉన్నారని చెప్పారు.    ఆర్టీసీ  ద్వారా  ఇప్పటి వరకు 3.82 కోట్ల  మంది మహిళలు ప్రయాణించారని,   రాజీవ్​ ఆరోగ్యశ్రీ కింద 21,534 మంది పేదలు గవర్నమెంట్​ వైద్య సేవలు పొందారన్నారు.     ఫ్రీ కరెంట్​ బిల్లు కింద 13,84,046 మందికి రూ.53.03 కోట్ల లబ్ది చేకూర్చామన్నారు. 

వాడవాడనా  జెండా అవిష్కరణ 

 కామారెడ్డిలోని కలెక్టరేట్​, క్యాంపు ఆఫీసులో కలెక్టర్​ ఆశిశ్​​ సంగ్వాన్​,  జిల్లా పోలీసు ఆఫీసులో ఎస్పీ సింధూశర్మ, జిల్లా కోర్టులో జిల్లా జడ్జీ వరప్రసాద్​   జాతీయ జెండాను ఎగుర వేశారు.  క్యాంపు ఆఫీసులో  ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి,  కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​ శ్రీనివాస్​,  బీజేపీ జిల్లా ఆఫీసు వద్ద ప్రెసిడెంట్​ అరుణతార,  బీఆర్​ఎస్​ ఆఫీసు వద్ద మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్​, జిల్లా ప్రెసిడెంట్​ ముజీబొద్ధిన్​   జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ ఆఫీసు,  సంఘాలు, విద్యా సంస్థల్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.