కరీంనగర్‌ జిల్లాలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇండిపెండెన్స్​డే వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని కలెక్టరేట్లు, పోలీస్‌‌ కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్‌‌, పార్టీ ఆఫీసుల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. మున్సిపాలిటీలు, మండలకేంద్రాలు, గ్రామాల్లోనూ జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటుకున్నారు. 

అందరికీ సంక్షేమ ఫలాలు 

కరీంనగర్, వెలుగు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని, కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని  ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 1.82 కోట్ల మంది మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో 58,317 మంది రైతన్నలకు రూ.2లక్షల లోపు రూ.383.89 కోట్లు పంట రుణాలు మాఫీ చేశామన్నారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి సన్మానించారు. జిల్లాలో విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీపీ అభిషేక్ మహంతి, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు. 

సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పాలన

పెద్దపల్లి, వెలుగు : ప్రజల సమగ్రాభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్‌‌‌‌పర్సన్‌‌ నేరేళ్ల శారద అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్‌‌లో ఇండిపెండెన్స్​ డే వేడుకలకు ఆమె చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్​ చైర్‌‌‌‌పర్సన్‌‌ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, కలెక్టర్​ శ్రీహర్ష, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయం

జగిత్యాల, వెలుగు : ప్రజా సంక్షేమమే ధ్యేయమని ప్రభుత్వం పనిచేస్తోందని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు పోలీసుల  గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్లూరి జిల్లా ప్రగతి నివేదికను వివరించారు. వేడుకల్లో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్,  కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్‌‌ బి.సత్య ప్రసాద్, జిల్లా జడ్జి నీలిమ, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్‌‌ కలెక్టర్లు పి.రాంబాబు, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. 

ప్రజాపాలన అందిస్తున్నాం

రాజన్నసిరిసిల్ల, వెలుగు : ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా ప్రజాపాలన అందిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు చీఫ్‌‌ గెస్ట్‌‌గా హాజరైన ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధికి బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించామన్నారు. మిడ్​ మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కరిస్తామన్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం వివిధ శాఖల్లో ప్రతిభ చూపిన 324 మంది ఉద్యోగులకు ప్రశంసా ప్రతాలు అందజేశారు.