78 వేల చెట్లు ఎట్ల కూలినయ్? క్లౌడ్ బరస్టా? లేక టోర్నడోనా? 

 

  • తాడ్వాయి అడవుల్లో అంతుపట్టని మిస్టరీ
  • ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ సైంటిస్టుల సాయం కోరిన అటవీ శాఖ
  • ఒకట్రెండు రోజుల్లో రానున్న టీమ్స్
  • విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క 
  • దేశంలో ఇదే మొదటిసారి: పీసీసీఎఫ్ డోబ్రియాల్  

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో కూకటివేళ్లతో సహా కూలిన వేలాది చెట్లు.. రెండు వందల హెక్టార్లలో ఒక క్రమపద్ధతిలో ఎవరో పనిగట్టుకొని కూల్చినట్టుగా కన్పిస్తున్న మొదళ్లు.. ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 ఎకరాల విస్తీర్ణంలో 78 వేలకు పైగా చెట్లు నేలకూలడం  వెనుక కారణాలు అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు. పరిశీలనకు వస్తున్న ఉన్నతాధికారుల్లో కొందరు క్లౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటుంటే, మరికొందరు టోర్నడో లాంటి సుడిగాలి వల్ల జరిగి ఉంటుందని అంటున్నారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ విధ్వంసం డ్రోన్​కెమెరాల ద్వారా బయటపడింది.

 ఇంత పెద్ద సంఖ్యలో చెట్లు కూలడం వెనుక రహస్యాన్ని ఛేదించేందుకు ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగంలోకి దిగింది. వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్​సెన్సింగ్​సెంటర్​(ఎన్ఆర్ఎస్సీ) సైంటిస్టుల సాయం కోరింది. ఇప్పటికే టెస్టుల కోసం అక్కడి మట్టిని ల్యాబ్స్​పంపించారు. ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ టీమ్స్ ఒకట్రెండు రోజుల్లో తాడ్వాయి అడవులకు వచ్చి శాస్త్రీయంగా అధ్యయనం చేయనున్నాయి. 

గాలి దుమారంతో భారీ వర్షం... 

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యం దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇక్కడి తాడ్వాయి రేంజ్​పరిధిలో గత నెల 31న  సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య తీవ్రమైన గాలి దుమారంతో భారీ వర్షం పడింది. తాడ్వాయి‒మేడారం రోడ్డుకు అడ్డంగా సుమారు 200 చెట్లు కూలి రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీంతో అదే రోజు రాత్రి రంగంలోకి దిగిన పోలీస్​ఆఫీసర్లు  జేసీబీల సాయంతో చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. తెల్లారి అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. అక్కడి పరిస్థితిని చూసి షాక్​కు గురయ్యారు. ఎక్కడ చూసినా వేళ్లతో సహా పెకిలి పడిపోయిన చెట్లు కనిపించాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించి 500 ఎకరాల విస్తీర్ణంలో 78 వేలకు పైగా చెట్లు కూలిపోయినట్టు గుర్తించారు. క్లౌడ్​బరస్ట్​వల్ల గానీ, టోర్నడో లాంటి సుడిగాలి వల్ల గానీ ఈ ఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

120 కిలోమీటర్ల వేగంతో గాలులు.. 

గత నెల 31న కురిసిన కుండపోత వర్షంతో పాటు తీవ్ర గాలిదుమారం వల్లనే చెట్లు కూలిపోయాయని స్థానిక గిరిజనులు చెబుతున్నారు. కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచి ఉండవచ్చని ఫారెస్టు ఆఫీసర్లు చెబుతున్నారు. పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోబ్రియాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాళేశ్వరం జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, భద్రాద్రి సర్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భీమా నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ములుగు డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షేత్రస్థాయిలో పర్యటించి కూలిపోయిన చెట్లను పరిశీలించారు. చెట్లు కూలడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదని..  చెప్పారు. 

తల్లుల దయ వల్లే సుడిగాలి ఊళ్లకు రాలేదు : సీతక్క  
తాడ్వాయి అడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుల్లో చెట్లు కూలిన ఘటనపై మంత్రి సీత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్క ఆరా తీశారు. బుధవారం సెక్రటేరియెట్ నుంచి పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. ‘‘అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణనష్టం జరగలేదు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేది. స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మక్క, సార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లుల ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లే సుడిగాలి ఊళ్ల మీదకు రాలేదు. త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లుల దీవెన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సుర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షితంగా బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిగారు” అని అన్నారు. ‘‘దీనిపై కేంద్ర మంత్రులు కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రెడ్డి, బండి సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్ స్పందించాలి. చెట్లు కూలడానికి గల కారణాలపై కేంద్రం నుంచి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశోధ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిపించాలి. అట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ ప్రాంతంలో చెట్లు పెంచేలా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలి” అని విజ్ఞప్తి చేశారు.

క్లౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావచ్చు.. 

చెట్లు కూలడానికి క్లౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణం అయి ఉండవచ్చు. నా 35 ఏండ్ల సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి ఘటన చూడలేదు. హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి ప్రదేశాల్లో మేఘాలు కిందికి వచ్చి, ఒకేసారి బలమైన గాలులు వీచి వానలు కురుస్తాయి. ఇక్కడ అలాగే జరిగిందనుకుంటున్నాం. తాడ్వాయి అడవి కింద సారవంతమైన నేలలు ఉన్నాయి. అందువల్ల చెట్లకు పైపైనే పోషకాలు, నీళ్లు దొరుకుతున్నాయి. అందుకే  వేర్లు పైపైనే ఉన్నాయి. భూమి లోపలికి వెళ్లలేదు. వేర్లు బలంగా లేకపోవడం వల్లే బలమైన గాలికి కిందపడినట్టు అనుమానిస్తున్నాం. కానీ సైంటిఫిక్​కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల సాయం కోరాం. త్వరలోనే  ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.

– పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డోబ్రియాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

మా ఇల్లు గాలికి కొట్టుకుపోయింది..  

గత నెల 31న ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. రాత్రి 7 గంటల సమయంలో సుడిగాలులకు మా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.  రాత్రంతా బయటికి రాకుండా బిక్కబిక్కుమంటూ గడిపినం. తెల్లారి లేచి చూసేసరికి మా పక్కనే ఉన్న  అడవిలో చెట్లన్నీ కూలిపోయినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. మాతో పాటు మా ఊళ్లో ఉన్న ఈసం ఎల్లయ్య, ఈసం లక్ష్మి తదితరులకు చెందిన సుమారు 16 ఇండ్ల పైకప్పులు కూడా కొట్టుకుపోయినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.
  
– ఈసం సాంబలక్ష్మి, కొండపర్తి గ్రామం,  తాడ్వాయి మండలం, ములుగు జిల్లా