7.5 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

కామారెడ్డి​, వెలుగు :  బాన్సువాడ టౌన్​ గౌలిగూడ కాలనీలోని  రహీమ్​ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 7.5 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని మంగళవారం  పట్టుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు.  తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్​ఫోర్స్​ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో  సిబ్బంది  తనిఖీలు  చేసినట్టు తెలిపారు.  

గుడుంబా అమ్ముతున్న  ఇద్దరిపై కేసు 
 

మాచారెడ్డి మండలం సోమార్​పేట్​లో  గుడుండా తయారీ చేసి అమ్ముతున్న  ఇద్దరు వ్యక్తులపై పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఎస్పీ ఆదేశాలతో టాస్క్​ఫోర్స్​ సీఐ తిరుపతయ్య  తనిఖీలు చేపట్టారు.   చిట్టవోయిన నర్సయ్య  గుడుంబా అమ్ముతుండగా ఇతన్ని పట్టుకొని 8.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.  గుడుంబాను తయారు చేస్తున్న నెమలిగుట్ట తండాకు చెందిన హీనపై కసు నమోదు చేసి , ఈమె నుంచి 200 లీటర్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై మాచారెడ్డి పోలీస్​స్టేషన్లో కేసు నమోదైంది.