కామారెడ్డి జిల్లాలో  ప్రజావాణిలో 74 ఫిర్యాదులు

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 74 మంది సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.  అర్జీలను కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్,  అడిషనల్ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి స్వీకరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ..  ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఆయా శాఖల ఆఫీసర్లు వెంటనే పరిష్కరించాలన్నారు.  జడ్పీ సీఈవో  చందర్ నాయక్​,  డీఆర్​డీవో సురేందర్,   డీపీవో శ్రీనివాస్​రావు, ఆఫీసర్లు పాల్గొన్నారు.