ఏడాదిలో మిగిలిన రోజుల కంటే చలికాలంలో మన శరీరానిపై వైరస్‌ల దాడి ఎక్కువగా ఉండటంతో పాటు ఇతర రోగాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక శీతాకాలంలో ఉండే వాతావరణ పరిస్థితుల కారణంగా మన దినచర్యలో కూడా మార్పులు వస్తుంటాయి. వ్యాయామం, నడకకు కేటాయించే సమయం తగ్గిపోతుంది. ఆహారపు అలవాట్లు కూడా ఛేంజ్ అవుతాయి. చలికాలంలో ఒక్కసారిగా జీవన శైలిలో మార్పు రావడం వల్ల బ్లడ్ షుగర్స్ లెవెల్స్ మన నియంత్రణలో లేకుండా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాకింగ్: షుగర్ కంట్రోల్ ఉండాలంటే వాకింగ్ అవసరం. శీతాకాలంలో ఉదయం వాకింగ్ చేసేందుకు చాలామంది ఇష్టపడరు. చలి.. మంచు కారణంగా పొద్దున్నే లేవడం కూడా కష్టమవుతుంది. దీంతో శరీరానికి వ్యాయామం తగ్గి షుగర్ లెవల్స్ పెరుగుతాయి. శరీరానికి సరైన శ్రమ లేకపోతే గ్లూకోజ్ లెవల్స్ స్థిరంగా ఉండవు. చలి కదా వాకింగ్ మానేస్తే మధుమేహం పెరుగుతుంది.
ఆహారంలో మార్పులు: శీతాకాలంలో చలి ఎక్కువుగా ఉండటంతో చాలామంది కొవ్వు.. కార్బోహైడ్రేట్ లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకొనేందుకు జనాలు ఇష్టపడతారు. ఇలాంటి ఆహారం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీంతో హఠాత్తుగా షుగర్ స్థాయిలు పెరిగి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాటర్ విషయంలో : శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో తక్కువ నీరు త్రాగుతుంటారు. శరీరానికి తగినంత మోతాదులో నీరు తాగకపోయినా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. నీరు తాగకపోవడం వలన నిర్జలీకరణం ద్వారా శరీరంలో ఎక్కువుగా ఉన్న గ్లూకోజ్ బయటకు వెళ్లే అవకాశం ఉండదు. సో సరిపడా వాటర్ తాగకపోయినా షుగర్ పెరుగుతుంది.
సూర్యరశ్మి లోపం : సహజంగా శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువుగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ డి విషయంలో చాలా ప్రభావం ఉంటుంది. దీంతో శరీరంలో విటమిన్ డి లోపంతో ఇన్సులిన్ తగ్గుతుంది.దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని కొన్ని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి.
ఫ్లూ సీజన్ : సాధారణంగా శీతాకాలంలో ముకు దిబ్బడ, జలుబు, దగ్గు , శ్వాశ సంబంధమైన వ్యాధులతో ఎక్కువుగా బాధపడుతుంటారు. వీటికి తోడు జ్వరాలు కూడా వస్తుంటాయి. అప్పుడు మన శరీరం ఇన్ఫెక్షన్ తో పోరాడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడితో కూడిన హార్మోన్లు విడుదలవుతాయి. జలుబు, జ్వరం కోసం వాడిన మందులు మధుమేహంపై ప్రభావం చూపుతాయి. ఎప్పుడైతే టెన్షన్ పెరుగుతుందో అప్పుడు శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి.
శీతాకాలంలో ఉండే వాతావరణం : చల్లని వాతావరణం.. చల్లటి గాలులు కూడా మధుమేహం ఉన్న వారికి ఇబ్బందిని కలుగజేస్తాయి. ఇన్సులిన్, డయాబెటిక్ మెడిసన్స్ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. షుగర్ మందులు తక్కువ ఉష్ణోగ్రతలో ఉంటే పవర్ తగ్గుతుంది. చల్లని వాతావరణం రక్తప్రవాహం కూడా తగ్గి శరీరంలోని ఇన్సులిన్ సరిగా పనిచేయదు. ఎప్పుడైతే ఇన్సులిన్ లోపం ఏర్పడిందో ఆటోమేటిక్ గా షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD): శీతాకాలంలో సూర్యరశ్మి సరిగా ఉండదు, దీంతో ఒక రకమైన డిప్రెషన్ కు లోనవుతారు. దీనిని సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (SAD) డిప్రెషన్ అంటారు. ఈ పరిస్థితి ఆహారం, నిద్ర లాంటి విషయాల్లో మార్పులు వస్తాయి. వీటి వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతేకాక SAD తో బాధపడేవారు తొందరగా అలసిపోతారు.