6,925 కిలోల జిలెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టివేత

యాదాద్రి, వెలుగు: డూప్లికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్లతో రవాణా చేస్తున్న పేలుడు పదార్థాలను యాదాద్రి జిల్లా బీబీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం డీసీపీ రాజేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్ర వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో గూడూరు టోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ టైంలో నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాకు వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా జిలిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించాయి. వాటికి సంబంధించిన పేపర్లను పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో 275 బాక్సుల్లో ఉన్న 6,925 కిలోల స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు.  మరో వైపు జిలెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఘట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి నల్గొండకు తరలించేందుకే అనుమతి ఉండగా అక్రమంగా నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి జనగామకు తరలిస్తున్నట్లు తేలింది.

 వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వ్యక్తిని విచారించగా జెలిటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇటీవల పాలకుర్తికి తరలించినట్లు చెప్పారు. దీంతో పోలీసులను నల్గొండ, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలకుర్తికి పంపించడంతో పాలకుర్తిలోని క్వారీలో మరో 300 కిలోల జిలెటిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉన్నట్లు, మరో 3 వేల కిలోల స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బండలు పగులకొట్టడానికి అమర్చినట్లు గుర్తించారు. పాలకుర్తిలో స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న 300 కిలోల స్టిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా రప్పిస్తున్నట్లు డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో రెడ్డి దామోదర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దత్తురావు, పెద్దివీడు నరసింహులు, లింగాల పరుశురాములును అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా, ప్రధాన సూత్రధారి బయ్యపు హనుమంతరెడ్డి పరారీలో ఉన్నట్లు చెప్పారు.