కామారెడ్డి జిల్లా ప్రజావాణిలో 67 ఫిర్యాదులు

కామారెడ్డి టౌన్, వెలుగు:  కామారెడ్డి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 67 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, విక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 

 కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలన్నారు.  కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.