జమ్మూకాశ్మీర్​ తుది విడత​లో 65శాతం పోలింగ్ నమోదు

జమ్మూ/శ్రీనగర్: జమ్మూకాశ్మీర్  అసెంబ్లీ ఎన్నికల్లో 65.48 శాతం పోలింగ్  నమోదైంది. మొత్తం 7 జిల్లాల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లలో చివరి, మూడో దశ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల ఓటర్లు పోలింగ్  కేంద్రాలకు వెళ్లి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అన్నిచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉధంపూర్  జిల్లాలో అత్యధికంగా 72.91%, సాంబాలో 72.41%, కథువాలో 70.53%, జమ్మూలో 66.79%, బంధిపొరలో 63.33%, కుప్వారాలో 62.76%, బారాముల్లాలో 55.73 శాతం పోలింగ్  నమోదైందని అధికారులు తెలిపారు. చాంబా నియోజకవర్గంలో అత్యధికంగా 77.35% ఓటింగ్ రికార్డయిందని చెప్పారు.