Health tips : పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా జరిగే మార్పులు!

చాలామందికి ఉదయాన్నే కాఫీ సిప్​ చేయందే రోజు మొదలు కాదు. అది ఓకే కానీ  హెల్త్​కి మంచిదేనా అనే డౌట్​ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది. పరగడుపున కాఫీ తాగితే శరీరంలో సహజంగా విడుదలయ్యే కార్టిసాల్​ హార్మోన్​ మీద ప్రభావం పడుతుంది. దానివల్ల రోజంతా ఎనర్జీ లేనట్టు ఉంటుంది. పరగడుపున కాఫీ తాగొద్దు అనేందుకు మరో రీజన్​... రాత్రిళ్లు నిద్రపోయినప్పుడు శరీరం నుంచి లిక్విడ్స్​ పోతాయి. ఉదయం లేచేసరికి శరీరం డీ హైడ్రేట్​ మోడ్​లో ఉంటుంది. కాఫీ ఏమో డైయూరెటిక్​. దాంతో  పరగడుపున తాగే కాఫీ వంట్లో ఉన్న లిక్విడ్స్​ ఇంకిన్నింటిని బయటకు పంపిస్తుంది. దాంతో మరింత డీహైడ్రేట్​ అవుతుంది శరీరం.

ఓహో... ఉదయం తాగే కాఫీ వల్ల జరిగే మంచి ఏమీ లేదా అయితే! అలాగని కాఫీ పడకపోతే ఇంజిన్​ నడవదు కదా... అంటున్నారా? అన్నిటికీ ఉపాయాలు ఉన్నట్టే హెల్దీగా కాఫీ తాగేందుకు కూడా ఒక మార్గం చెప్తున్నారు న్యూట్రిషనిస్ట్​లు. వాళ్లు చెప్పినట్టు తాగితే  కాఫీ మీ శరీరానికి మేలు చేస్తుందట!

  •     ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కాఫీ తాగడం మానేయాలి. కాఫీ సిప్​ చేయడానికి ముందు కొన్ని నట్స్​ తినాలి. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
  •      కాఫీలో పాలకు బదులుగా వే ప్రొటీన్​ కలుపుకుని తాగాలి. ఇది రుచిగా ఉంటుంది. పాలలా కాకుండా తేలికగా అరిగిపోతుంది. అంతేకాదు జీవక్రియలకు హెల్దీ బూస్ట్​ ఇస్తుంది.
  •     అన్​ఫ్లేవర్డ్​ కొల్లాజెన్​ను కలుపుకుంటే కాఫీలో పోషక విలువలు పెరుగుతాయి. ఇది సింపుల్​గా, ఎఫెక్టివ్​గా రోజును మొదలుపెట్టేందుకు కిక్​ స్టార్ట్​ ఎలిమెంట్​ ఇది.
  •     పాల కాఫీ తాగం.. బ్లాక్​ కాఫీ తాగుతాం అనేవాళ్లకు కూడా కొన్ని టిప్స్​ చెప్పారు. అవేంటంటే ... బ్లాక్​ కాఫీలో కొన్ని నిమ్మ రసం చుక్కలు, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి. దీనివల్ల కాఫీకి మంచి ఫ్లేవర్​ వస్తుంది.
  •      కాఫీ, బ్రేక్​ఫాస్ట్​ కలిపి తీసుకుంటే ఒక మీల్​ అయిపోతుంది అనుకునేవాళ్లు.  ఫ్రోజెన్​ అరటిపండు ముక్కలు కలిపి కాఫీ తాగితే న్యూట్రిషియస్​ కేఫె లాట్టె అవుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది.