Health Tips: పరిగడుపున నానబెట్టిన బాదం పప్పులు తింటే కలిగే 5 లాభాలు

బాదం పప్పులు..మనం పొద్దున లేవగానే నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తింటుంటాం.. హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి తల్లి పొద్దునే లేవగాను తన పిల్లలకు నానబెట్టిన పొట్టు తీసిన బాదం పప్పులను అందిస్తుంది. చాలా డైటీషీయన్లు బాదంపప్పులు తినాలని మనకు సూచిస్తుంటారు.. నానబెట్టిన బాదంపప్పులు పొద్దునే తింటే కలిగి ఆరోగ్యకరమైన లాభాలేంటో చూద్దాం.. 

జీర్ణక్రియకోసం.. 

నానబెట్టిన బాదంపప్పులు (Almonds) తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ బాదం పప్పులు జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్ లను  ఉత్పత్తి చేయడంలో సాయపడుతాయట. అంతేకాదు పోషకాల శోషణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు. 

మెమరీ, ఏకాగ్రతకోసం.. 

విద్యార్థులకు, జాబ్ చేసే మహిళలు, పురుషులకు చదువులో, పనిలో  మెమరీ, ఏకాగ్రతకు పోషకాలు చాలా అవసరం.  నానబెట్టిన బాదంపప్పుల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. అందుకే విద్యార్థులు, వర్కింగ్ పురుషులు, మహిళలకు వీటిని ఎక్కువగా తినాలని సూచిస్తుంటారు డైటీషియన్లు. 

ఆరోగ్య కరమైన గుండె కోసం.. 

నానబెట్టిన బాదం పప్పుల్లో యాంటాక్సీడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణ, చెడు కొలెస్ట్రరాల్ ను నిరోధిస్తాయి. ఆరోగ్యకరమైన గుండెపనితీరు, కొలెస్ట్రరాల్ నిర్వహణకు డైటీషియన్లు నానబెట్టిన బాదం పప్పులు తినాలని  సూచిస్తారు. 

బరువు తగ్గాలంటే.. 

బాదం పప్పుల్లో ఫైబర్ , ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనల్ని  ఎక్కువ సమయంలో పొట్టను నిండుగా ఉంచి ఆకలి అనిపించదు. దీంతో అనవసరమైన ఆహారం తీసుకోకుండా నియంత్రించవచ్చు. దీంతో బరువు కంట్రోల్ లో ఉంటుంది. 

ఆరోగ్యకరమైన చర్మం కోసం.. 

నానబెట్టిన బాదంపప్పుల్లో విటమిన్ ఇ, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యకరంగాప్రకాశవంతంగా ఉంచుతాయి. 
గుప్పెడు బాదంపప్పులు రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే పరిగడుపున పొట్టు తీసి తింటే ఎంతో ఆరోగ్యం.. చిన్న పిల్లలకైతే 3 నుంచి 4 బాదం పప్పులు చాలు.