57 ఏండ్ల క్రితమే నేపాల్‌‌‌‌లో రాముని పోస్టల్‌‌‌‌ స్టాంప్

రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. ముహూర్తం ఈ మధ్యే నిర్ణయించారు. కానీ.. 2024 సంవత్సరం పేరుతో  57 ఏండ్ల క్రితమే నేపాల్‌‌‌‌లో ఒక పోస్టల్‌‌‌‌ స్టాంప్‌‌‌‌ తీసుకొచ్చారు. అదేంటి.. నేపాల్ వాళ్లకు అప్పుడే ఎలా తెలిసిపోయింది అంటారా? వాస్తవానికి వాళ్లు స్టాంప్‌‌‌‌ మీద ప్రింట్ చేసింది సరైన సంవత్సరమే.

ఎలాగంటే.. నేపాల్‌‌‌‌లో ఈ పోస్టల్‌‌‌‌ స్టాంప్‌‌‌‌ని ఏప్రిల్18, 1967న రామనవమి (రాముడి పుట్టినరోజు) సందర్భంగా రిలీజ్‌‌‌‌చేశారు. అయితే.. మనం రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా వాడే గ్రెగోరియన్ క్యాలెండర్‌‌‌‌‌‌‌‌ ప్రకారం అది 1967. కానీ.. నేపాల్‌‌‌‌తోపాటు ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో వాడే హిందూ క్యాలెండర్ అయిన విక్రమ్ సంవత్‌‌‌‌ ప్రకారం అది 2024. గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే విక్రమ్ సంవత్ 57 సంవత్సరాలు ముందుంది. కాబట్టి, 57 ఏండ్ల క్రితమే వాళ్లకు 2024 వచ్చేసింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినా సరిగ్గా రాముడి ప్రతిష్ఠాపన జరిగే ఏడాదిలోనే స్టాంప్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ కావడం విశేషం.