Health Alert: 10 ఏళ్లుగా సిగరెట్లు తాగుతున్నారా.. అర్జంట్‎గా ఈ 5 పరీక్షలు చేయించుకోండి..!

మీరు సిగరెట్లు తాగుతున్నారా.. స్మోకింగ్ చేస్తున్నారా.. అది కూడా పదేళ్లుగా తాగుతున్నారా.. అయితే అర్జంట్ గా ఈ ఐదు పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో స్మోకింగ్ వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని.. మారిన ఆహారపు అలవాట్లు.. శారీరక శ్రమ లేకపోవటం.. కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల స్మోకింగ్ ఎఫెక్ట్ శరీరంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంటనే ఈ ఐదు పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1. చెస్ట్ ఎక్స్-రే

ఊపిరితిత్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి చెస్ట్ ఎక్స్ రే కంపల్సరీ అంటున్నారు వైద్యులు. ఈ ఎక్స్ రే వలన ఊపిరితిత్తుల ఎలా పని చేస్తున్నాయి..? ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా..? అనే విషయాలు వెల్లడవుతాని చెబుతున్నారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), ఎంఫిసెమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అసాధారణతలను గుర్తించడంలో సహాయపడుతుండుందంటున్నారు నిపుణులు. తద్వారా సత్వర చికిత్స తీసుకుని వ్యాధి నయం చేసుకోవచ్చు. 


2. ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష (స్పిరోమెట్రీ)

స్పిరోమెట్రీ పరీక్ష అంటే.. మీ ఊపిరితిత్తులు ఎంత బాగా పని చేస్తున్నాయో అంచనా వేయడం.  దీని ద్వారా మీ ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు. ధూమపానం చేసేవారిలో ఎక్కువగా కనిపించే ఉబ్బసం,  సీవోపీడీ వంటి పరిస్థితులను నిర్ధారించడానికి ఈ పరీక్ష ముఖ్యమైనది. ఇది ఊపిరితిత్తుల వ్యాధుల పురోగతిని, ఏవైనా చికిత్సల ప్రభావాన్ని ట్రాక్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

3. ఊపిరితిత్తుల CT స్కాన్

ఊపిరితిత్తుల CT స్కాన్ ద్వారా.. ఎక్స్ రేతో పోలిస్తే మరింత వివరంగా, క్లారిటీ ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చు. అధిక దూమపానం చేసే అలవాటు ఉన్నవారు ఈ పరీక్ష చేసుకోవడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. దీని ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర తీవ్రమైన పరిస్థితులను ముందుగానే గుర్తించడంలో సహాయపడుతుందంటున్నారు వైద్యులు.

4. రక్త పరీక్షలు

సాధారణ రక్త పరీక్షలు మొత్తం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంతో పాటు ధూమపానానికి సంబంధించిన సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి. ఇందులో మరి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. మొత్తం ఆరోగ్యాన్ని అంచనా వేయడంతో పాటు రక్తహీనత, =ఇన్ఫెక్షన్‌ల వంటి పరిస్థితులను గుర్తిస్తుంది కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష
ధూమపానం చేసేవారిలో పెరిగిన గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి,  కొలెస్ట్రాల్ స్థాయిలను కొలవడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష
కార్బాక్సీహెమోగ్లోబిన్ స్థాయిలు: రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని అంచనా. ధూమపానం మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో సూచిస్తుంది ఈ టెస్ట్ సూచించిస్తోంది. 

5. హార్ట్ హెల్త్ స్క్రీనింగ్

ధూమపానం చేసేవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) కోసం రెగ్యులర్ స్క్రీనింగ్‌లు గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో సహాయపడతాయి. హైపర్‌టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, క్రమరహిత గుండె లయలు వంటి సమస్యలను ముందుగానే హార్ట్ హెల్త్ స్క్రీనింగ్ గుర్తించవచ్చు. ధూమపానం చేసేవారికి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే పైన పేర్కొన్న పరీక్షలు చేయించుకోవడం బెస్ట్ అంటున్నారు నిపుణులు. ఈ పరీక్షల ద్వారా సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి.