Yoga Day 2024 : యోగాను బ్యాన్ చేసిన దేశాలు ఉన్నాయా..? నిజమా..!

ప్రపంచం మొత్తం యోగాకి దాసోహమైంది. లెక్కలేనంత మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే ఫిట్ నెస్ బెనిఫిట్స్ అందించే యోగాపై కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల బ్యాన్ కాని బ్యాన్ అమలులో ఉంది. ఇంతకీ ఆ ప్లేస్లు ఏంటంటే.... 

యోగా మతపరమైందని.. ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందిస్తుందని భ్రమపడతారు రష్యా జనాలు. అందుకే యోగాపై బ్యాన్ విధించారు. యోగాకి మతంతో సంబంధం లేదని మేధావులు మొత్తుకున్నప్పటికీ అక్కడి జనాలు వినిపించుకోలేదు. చివరికి అక్కడి ప్రభుత్వం పదేళ్ల క్రితం 'యోగా నిషేధ చట్టాన్ని' ఎత్తేసింది. కానీ, కొన్ని కండిషన్స్ మాత్రమే యోగా చేసుకోవచ్చని చెప్పింది. అయినా కూడా యోగాపై అనధికార నిషేధం కొనసాగుతోంది. యోగా గురువులను అరెస్ట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. రష్యాలోని ప్రధాన నగరాలను మినహాయిస్తే.. ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో యోగాపై నిషేధం అమలులో ఉంది.

 కల్చర్ దెబ్బతింటుందని

ఇండియాలో పుట్టిందని, దాని కారణంగా తమ కల్చర్ దెబ్బతింటుందని కెనడా ప్రజలు యోగాను పక్కన పెట్టేశారు. అంతేకాదు ఇక్కడ ఉచితంగా కూడా యోగా చెప్పేందుకు అనుమతించదు. అయితే కొందరు గ్రూపులుగా ఏర్పడి 'యోగా అనుమతి' కోసం పోరాడి విజయం సాధించాయి. కానీ, కెనడాలో ఇప్పటికీ చాలా మంది యోగాను నమ్మరు. ప్రాక్టీస్ చెయ్యరు.

 కొన్ని వర్గాల్లో మాత్రమే....

మలేసియా, ఇండోనేసియాలోని కొన్ని వర్గాలు యోగాపై నిషేధం విధించుకున్నాయి. మతానికి వ్యతిరేకమనే వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇస్లాంలోనూ యోగాని ఆచరిస్తున్నవాళ్లు లేకపోలేదు.

యోగా ప్లేస్ లో

వేల్స్ (యూలే)లోని ఒక చర్చి యోగాని నిషేధించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనాలు ఆ చర్చి సేవల్ని బహిష్కరించారు. అయినా కూడా నిషేధం తొలగించలేదు. కానీ, అక్కడ 'పైలెట్స్' ఎక్సర్సైజ్ మాత్రం కొనసాగుతోంది. ఇది దాదాపు యోగా మాదిరిగానే ఉంటుంది.