డ్రైఫ్రూట్స్ తింటే ..5ఆరోగ్యకర లాభాలు

డ్రైఫ్రూట్స్ తింటే ఎన్నో ఆరోగ్య కర ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు.. అవేంటో తెలుసుకుందాం. 

డ్రైఫ్రూట్స్ లో ఆరోగ్యకమైన కొవ్వులు సమృద్దిగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్మాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని  తగ్గిస్తాయి. 
డ్రైఫ్రూట్స్ లో అధిక డైటరీ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. డ్రైఫ్రూట్స్ లో పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు,డైటరీ ఫైబర్స్,  ఖని జాలు సమృద్ధిగా ఉంటాయి. 

డ్రైఫ్రూట్స్ లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తాయి. డ్రైఫ్రూట్స్ లో మెగ్నిషి యం, కాల్షియం, బోరాన్, విటమిన్ K వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం  చేస్తాయి. 

డ్రైఫ్రూట్స్ లో సహజ చక్కెరలుంటాయి. ఇవి క్రీడాకారులకు మంచి ఫలితాలను ఇస్తాయి. శక్తివంతంగా మారుస్తాయి.   వ్యాయామానికి ముందు  లేదా తర్వాత అల్పా హారంగా వీటిని తీసుకుంటే  బాగుంటుంది.