బెస్ట్ లేటెస్ట్ ఫీచర్స్ ఉన్న.. రూ.10లక్షల లోపు కార్లు ఇవే..

కారు కొనాలనుకుంటున్నారా.. మార్కెట్లో రక రకాల కంపెనీల కార్లు, వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్ పీజీ, ఎలక్ట్రిక్ తో నడిచే కార్లు మార్కెట్ ఉన్నాయి. అయితే ఏ కంపెనీకారు కొనాలి.. ఏ టైప్ కారు కొనాలి.. మన బడ్జెట్ లో ఉందా ఇలా అనేక రకాల సందేహాలుంటాయి.. అలాంటి వారికోసం లేటెస్ ఫీచర్స్ తో రూ.10 లక్షల లోపు లభించే ఐదు కార్ల గురించి తెలుసుకుందాం..   

టాటా పంచ్ 

రూ. 10 లక్షల లోపు బెస్ట్ ఫీచర్స్ కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇది ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నా కారు.. దీని ధర రూ. 6.13 వేల నుంచి రూ. 10.20 వేల లోపు (ఎక్స్ షోరూమ్ ) వివిధ వేరియంట్లలో లభిస్తుంది. టచ్ స్క్రీన్ ఇన్ ఫోటైన్ మెంట్, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ ఫ్యానెల్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లతో ఎక్కవుగా అమ్ముడవుతోంది. 

హ్యుందాయ్ ఎక్స్‌టర్ 

హ్యుందాయ్ ఎక్స్‌టర్ దీని ధర రూ. 6.13లక్షల నుంచి రూ. 10.43 లక్షల మధ్య ఉంది. లేటెస్ట్ హ్యుందాయ్ ఫీచర్ లోడెడ్ వేరియంట్లు ఉన్నాయి.  ఇందులో కూడా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఆటోమేటిక్ ఎట్మాస్పియల్కంట్రోలర్,  సన్ రూఫ్ ఫీచర్లు ఉన్నాయి. 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ. 7.51 లక్షలతో మొదలై  10 లక్షల లోపు పొందవచ్చు. రూ.13.03 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, సెల్ఫ్ అట్మాస్పియర్ కంట్రోల్. ఇది పంచ్ SUV , ఎక్స్‌టర్ కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్

నిస్సాన్ మాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి రూ.11.11 లక్షల మధ్య ఉంటుంది. టచ్‌స్క్రీన్ వంటి ఫీచర్లు ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ డివైజ్ క్లస్టర్, ఆటోమేటిక్ ఎట్మాస్పియర్ కంట్రోల్ ఫీచర్లను రూ.10 లక్షల ధరతో పొందవచ్చు. 

రెనాల్ట్ కిగర్

రెనాల్ట్ కిగర్ ధర రూ.6 లక్షల నుండి రూ. 11.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది నిస్సాన్ మాగ్నైట్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.