Health Alert:హైబీపీతో 5 నష్టాలు

రక్తపోటు(Blood Preasure) అనేది మన గుండె ధమనుల గోడలపై కలిగే ఒత్తడి.. మన గుండె శరీరమంతా రక్తాన్నీ పంపింగ్ చేసేందుకు ధమనుల గోడలపైకి రక్తాన్ని ఒత్తిడితో నెడుతుంది. ఇది మన మొత్తం ఆరోగ్యానికి ముఖ్యమైన సూచన. 

గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం.. రక్తపోటు ఎక్కువయితే రక్తనాళాలు, ధమనులను దెబ్బతీస్తుంది. ఇది గుండె, స్ట్రోక్ కు దారి తీసే అవకాశం ఉంటుంది.

మెదడుకు నష్టం : అధిక బ్లడ్ ప్రెషర్ గుండెతోపాటు.. మెదడును కూడా ప్రమాదంలో పడేస్తుంది. ఐబ్లడ్ ప్రెషర్ మెదడును అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. 

హైపర్ టెన్షివ్ రెటినోపతి : అధిక రక్తపోటు రెటీనాలోని రక్తనాళాలను దెబ్బతిస్తుంది. ఇది దృష్టిని కోల్పోయేలా చేస్తుంది. 

నరాలపై ప్రభావం: హై బ్లడ్ ప్రెషర్ వల్ల మెదడుకు అంతే రక్తప్రవాహంలో అసమతుల్యతల కారణంగా  నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది కంటిచూపు లోపాలకు దారి తీస్తుంది. 

లైంగిక సామర్థ్యంపై ప్రభావం : అధిక రక్తపోటు పురుషులలో అంగస్థంభన, స్త్రీలలో లైంగిక కోరికను తగ్గించడంతో సహా లైంగిక బలహీనతలకు కారణమవుతుంది.