షాకింగ్ : 2030 నాటికి 45 శాతం ఒంటరి మహిళలే.. పెళ్లీపిల్లలు వద్దనుకుంటున్నారు

సొసైటీలో చాలా మార్పులు వస్తున్నాయి. మహిళల అభిప్రాయాలు కూడా స్పష్టంగా మారాయి. లేడీస్ లో వచ్చిన ఈ మార్పులు ట్రెడిషన్స్, ఫ్యామిలీ రెస్పాన్సబిలిటీ, పెళ్లి వంచి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఓ సర్వేలో తేలిన అంశాలు షాక్ కు గురిచేస్తున్నాయి. పెళ్లి, తల్లి అవ్వడం విషయాల్లో మహిళలు ఎలా ఆలోచిస్తున్నారని మోర్గాన్ స్టన్లీ ఓ స్టడీ చేశారు. 

మారుతున్న సమాజంలో పరిస్థితులు అందరిపై ప్రభావం చూపిస్తున్నాయి. స్త్రీలు తల్లి కావడం, పెళ్లి చేసుకోవడంలో భవిష్యత్ లో ఎలా ఆలోచిస్తున్నారు. వాళ్ల నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయని మోర్గాన్ సర్వే చేశాడు. అందులో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు చెప్పాడు. 2030 నాటికి 25 నుంచి -44ఏళ్ల స్త్రీలలో దాదాపు 45% మంది ఒంటరిగా, సంతానం లేని వారే ఉంటారని ఆయన అంచనా చేశారు. 

ఇది ఆర్థిక విధానాలు, ఆఫీసులు, వివాహం, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలు దాన్ని ప్రభావితం చేస్తాయట. లేడీస్ వారి సెల్ఫ్ డెవలప్ మెంట్ కు, ప్రొఫెషనల్ గా ఎదగడానికి ఎక్కువగా ఇష్టపడతారని మోర్గాన్ స్టాన్లీ చెప్పారు. సాంప్రదాయ కుటుంబ బాధ్యతల కంటే ప్రొఫెషనల్ గా హై రేంజ్ లో ఉంచే లైఫ్ స్టైల్ కు నిర్ణయాలకు దారితీస్తాయి. పెళ్లి, పిల్లలు లేకుండానే మహిళలు ఒంటరిగా జీవిచడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దానికి ప్రధాన కారణం 20 దశకంలో వివాహం చేసుకునే ఆచారంలో మునపటి తరాలతో పోల్చితే చాలా డిఫరెన్స్ ఉండటం.

Also Read :- ఏ వయస్సులో ఎన్ని గంటలు నిద్రపోవాలో తెలుసా

ప్రసెంట్ లేడీస్ తమ వ్యక్తిగత అభివృద్ధికి మరియు వృత్తికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అన్ మ్యారీడ్ గా ఉండడం అనేది ఆకర్షణీయమైన లుక్ గా వారు భావిస్తున్నారని మోర్గాన్ చెప్పాడు. 30, 40 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్న మహిళలు కూడా ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అంతే కాదు వారు మళ్లీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. పూర్వ మహిళలు 20 ఏళ్లకే తల్లులు అయ్యే వారు. కానీ తల్లి కావాలనే ఆలోచనను ఆలస్యం, పునరాలోచించే తీరు వల్ల సమాజంపై వివిధ ప్రభావాలను చూపుతున్నాయి.  జాబ్ లైఫ్ స్టైల్ మెయిన్ టెనెన్స్, సమతుల్యత , ఉద్యోగ పెరుగుదల మరియు పిల్లలను కనే ఖర్చుతో సహా అనేక విషయాల వల్ల ఇది సంభవిస్తుంది.

ఈ రోజుల్లో, ఎక్కువ మంది మహిళలు తమ ఇళ్లలో ప్రధాన సంపాదకులుగా మారుతున్నారు మరియు శ్రామిక శక్తిలో ఎక్కువ వాటాను కలిగి ఉన్నారు. ఈ మార్పు మహిళలకు వారి వ్యక్తిగత ఆనందం మరియు కెరీర్ వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చింది. ఒంటరి, పిల్లలు లేని మహిళల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతుందని అంచనా. ఎక్కువ మంది మహిళలు వివాహం, పిల్లలను కనడం ఆలస్యం లేదా వద్దనుకోవడానికి కారణం వారి ఆర్థిక స్థితి పెరిగే ఛాన్స్. 2030 నాటికి వివాహం మరియు తల్లిదండ్రులపై సమాజం యొక్క అభిప్రాయాలు కూడా మారవచ్చు.