కొరట్​పల్లిలో 42 డిగ్రీల ఎండ

నిజామాబాద్​, వెలుగు: జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గురువారం డిచ్​పల్లి మండలంలోని కొరట్​పల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి ​ షురువయ్యాక ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. గురువారం మోపాల్​లో 41.9, ఎడపల్లిలో 41.8, బోధన్​, కోటగిరి, నిజామాబాద్​, మోస్రాలో 41 డిగ్రీలు నమోదైంది.

సాలూరా, చందూర్​, ఇందల్​వాయి, భీంగల్​, జక్రాన్​పల్లి, వేల్పూర్​, రుద్రూర్​, ఎర్గట్లా, మోర్తాడ్​, డొంకేశ్వర్, కమ్మర్​పల్లి, వర్ని, బోధన్​లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్​ అయింది. టెన్త్​ ఎగ్జామ్​ సెంటర్లున్న స్కూల్స్​లో ఉదయం జరగాల్సిన క్లాసులను మధ్నాహ్నం నిర్వహిస్తున్నారు. దీంతో ఎండలను తట్టుకోలేక చాలా మంది స్టూడెంట్స్​ స్కూలుకు రావడంలేదు.