ఎండలు బాబోయ్‌‌

ఎండలు దంచికొడుతుండటంతో నిజామాబాద్‌‌ నగరంలో ఆదివారం రోడ్లన్నీ కర్య్ఫూను తలపించాయి.  ఆదివారం నగరంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయం జనం ఇండ్లకే పరిమితమయ్యారు. భానుడి భగభగతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్ర ఉక్కపోత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.