ఆర్టీసీ బస్సులో 40 తులాల బంగారు నగలు చోరీ

జగిత్యాల, వెలుగు: ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా మహిళ వద్ద ఉన్న 40 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన మిట్టపెల్లి జలజ అనే మహిళ 40 తులాల బంగారు నగలు బ్యాంకులో డిపాజిట్ చేద్దామని సోమవారం జగిత్యాలకు వెళ్లింది.

 కొన్ని కారణాలతో డిపాజిట్ చేయకుండా తిరిగి పాత బస్టాండ్‌‌‌‌లో తక్కళ్లపల్లి వెళ్లేందుకు మంచిర్యాల డిపో బస్సు ఎక్కింది. ఇంటికి వెళ్లి చూసే సరికి బ్యాగులో బంగారు నగలు కనిపించకపోవడంతో వెంటనే బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.