నిర్మించారు.. వదిలేశారు

  • అడవిని తలపిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రాంతం
  • ఇప్పటికైనా ఇండ్లను అప్పగించాలని పేదల విన్నపం 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించారు. వీటి కోసం దాదాపు రూ. 2.12 కోట్లను ఖర్చు చేశారు. కాగా 2018 లో వీటి నిర్మాణం స్టార్ట్ కాగా.. ఏడాదిలోనే నిర్మాణాలు పూర్తయ్యాయి. కానీ ఇప్పటి వరకు వాటిని లబ్ధిదారులకు అందించలేదు. 5 సంవత్సరాల నుంచి ఎవరూ పట్టించుకోకపోవడంతో డబుల్ బెడ్ రూం ఇండ్ల మధ్య పిచ్చి మొక్కలు పెరిగాయి. 

పెద్ద పెద్ద వృక్షాలుగా మారి ఒక అడవిని తలపిస్తోంది. మందుబాబులకు అడ్డాగా మారింది. గతంలో ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉన్న  ప్రజలు తమకు ఇండ్లను అప్పగించాలని కోరుతున్నారు. - వెలుగు, ఫొటోగ్రాఫర్ కరీంనగర్