4 నెలల పాపకు నోబుల్​ బుక్​ అవార్డు

కోరుట్ల, వెలుగు: ఫ్లాష్‌‌‌‌‌‌‌‌ కార్డులను గుర్తుపడుతున్న 4 నెలల చిన్నారి నోబుల్​బుక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్​వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డ్స్​ అవార్డుకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్-–మౌనిక దంపతుల కూమార్తె ఐరా(4 నెలలు) 135 ఫ్లాష్‌‌‌‌‌‌‌‌కార్డులను గుర్తుపడుతోంది.

దీంతో యంగెస్ట్ టూ ఐడెంటిటీ విభాగంలో నోబుల్‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్​ రికార్డుకు దరఖాస్తు చేశారు. జూన్‌‌‌‌‌‌‌‌లో 135 ఫ్లాష్​ కార్డుల ఐడెంటీ వీడియోలను పరిశీలించిన నోబుల్‌‌‌‌‌‌‌‌ సంస్థ చిన్నారికి అవార్డు కేటాయించినట్లు తెలిపారు.