4 నెలల చిన్నారికి నోబుల్‌‌ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్ రికార్డ్​

కోరుట్ల, వెలుగు:  347 ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టిన ఓ 4 నెలల చిన్నారి నోబెల్‌‌బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్ రికార్డు సాధించింది.   జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి డాక్టర్​ కార్తికేయన్​ రాజు–స్రవంతి దంపతుల కొడుకు హన్విద్​ కృష్ణ 347 ప్లాష్​ కార్డులు గుర్తు పడుతున్నాడు. 

దీంతో తల్లిదండ్రులు నోబెల్​బుక్​ఆఫ్​వరల్డ్​రికార్డు అందించే  యంగెస్టు టూ ఐడెంటీ విభాగంలో దరఖాస్తు చేశారు. వెజిటేబుల్స్, బర్డ్స్‌‌, యానిమల్స్‌‌, దేశాల ఫ్లాగ్స్, కలర్స్​, వెహికిల్స్.. ఇలాంటి గుర్తుపట్టగా సంస్థ ప్రతినిధులు చిన్నారికి అవార్డు కేటాయించినట్లు  తల్లిదండ్రులు చెప్పారు.